Sat Apr 04 2026 12:08:51 GMT+0530 (India Standard Time)
జగన్ ఎవరి వత్తిడులకు లొంగరు
ముఖ్యమంత్రి జగన్ ఎవరి వత్తిడులకు తలొగ్గే నేత కారని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఎవరి వత్తిడులకు తలొగ్గే నేత కారని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకోవడం ప్రత్యేక పరిస్థితుల కారణంగానే జరిగిందన్నారు. అంతేకాని ఎవరో వత్తిడి తెస్తే వెనక్కు తీసుకున్నారన్న ప్రచారాన్ని మిధున్ రెడ్డి ఖండించారు. మూడు రాజధానుల విషయంలో తొలుత చేసిన ప్రకటనకు జగన్ కట్టుబడి ఉంటారని మిధున్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం...
పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మిధున్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. పోలవరం నిధులను వెంటనే విడుదల చేసేలా వత్తిడి తెస్తామని చెప్పారు.
Next Story

