Fri Dec 05 2025 12:39:08 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుగడిగా ఉన్న మిధున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా ఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించారు దీంతో మిధున్ రెడ్డి ని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
వసతులు కల్పించాలంటూ...
రాజమండ్రి జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ మిధున్ రెడ్డి పిటీషన్ వేయడంతో దీనిని విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇప్పటికే జైలులో ఉన్న మిధున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంటి భోజనంతో పాటు పత్రికలు, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది.
Next Story

