Sat Apr 04 2026 12:09:20 GMT+0530 (India Standard Time)
ధన్యవాదాలు జగన్ సర్
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా తనను ఎంపిక చేసినందుకు ఎమ్మెల్సీ జకియా ఖానూమ్ ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా తనను ఎంపిక చేసినందుకు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానూమ్ ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. జకియా ఖానూమ్ తో పాటు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా జగన్ ను కలిశారు.
మైనారిటీలకు....
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీలకు అత్యున్నత పదవులు దక్కుతున్నాయని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తూ వారిని రాజకీయంగా ఎదిగేలా చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని తెలిపారు.
Next Story

