Mon Sep 09 2024 11:31:53 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టయ్యారు. బెంగళూరులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టయ్యారు. బెంగళూరులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో లేళ్ల అప్పిరెడ్డి నిందితుడు. ఆయనపై కేసు నమోదు కావడంతో పాటు హైకోర్టు వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటీషన్లను కొట్టివేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
నిందితుల కోసం...
దీంతో లేళ్ల అప్పిరెడ్డి మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తో పాటు తలశిల రఘురాం ఈ కేసుల్లో నిందితులు. అయితే ఇప్పటి వరకూ ఈ కేసులో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Next Story