Tue Dec 16 2025 01:00:24 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును కలిసిన జంగా
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఆయనను బాపట్లలో కలిసి చర్చించారు. రాష్ట్ర రాజకీయాలపై వారిరువురూ చర్చించుకున్నారని తెలిసింది. త్వరలో జంగా కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
త్వరలో వైసీపీలో చేేరేందుకు...
గురజాలలో వైసీపీ నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తికి వరసగా రెండుసార్లు ఎమ్మెల్సీ అవకాశాన్ని జగన్ కల్పించారు. అయితే ఈసారి గురజాల టిక్కెట్ ఆశించి భంగపడ్డ జంగా కృష్ణమూర్తి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో సమావేశమైన జంగా బాపట్లలో ఆదివారం చంద్రబాబును కలిసి చర్చించారు. జంగా కృష్ణమూర్తి వెంట టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
Next Story

