Sun Mar 15 2026 10:21:40 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరనున్నారు.
న్యాయం జరగలేదని...
గురజాల నియోజకవర్గం వైసీపీ టిక్కెట్ ను జంగా కృష్ణమూర్తి ఆశించారు. కానీ వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. దీంతో నిన్న బాపట్లకు వచ్చిన చంద్రబాబును కలిసిన జంగా కృష్ణమూర్తి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. అందుకే ఈరోజు రాజీనామా చేశారు. తన అనుచరుల భవిష్యత్ కోసం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story

