Thu Jan 29 2026 17:19:00 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఓవరాక్షన్
తిరుమలకు వచ్చిన దువ్వాడశ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటో షూట్ చేసుకున్నారు

తిరుమలకు వచ్చిన దువ్వాడశ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటో షూట్ చేసుకున్నారు. ఏడు కొండలపై ఫొటో షూట్ చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దివ్వెల మాధురి మాడ వీధుల్లో, పుష్కరిణి వద్ద ఫొటో చేయడం కాంట్రవర్సీకి కారణమయింది. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఫొటోలను దగ్గరుండి తీయించారు.
ఫొటో షూట్ తీసుకుని...
అయితే తిరుమలలో మీడియాతో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను దివ్వెల మాధురిని వివాహం చేసుకోలేదని, అలాంటి వార్తలను ఆయనను ఖండించారు. వాణితో తన విడాకుల కేసు కోర్టులో ఉందని, కోర్టు కేసు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటామని తెలిపారు. అయితే ఇద్దరూ కలసి ఫొటో షూట్ చేసుకోవడం పై భక్తులు మండి పడుతున్నారు.
Next Story

