Sun Mar 08 2026 12:11:22 GMT+0530 (India Standard Time)
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ
వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు

వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య టీడీపీలో చేరారు. కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేేరారు. అప్పటి వరకూ ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2018లో వైసీపీలో చేరిన సి. రామచంద్రయ్యకు వైఎస్ జగన్ 2021లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.
పార్టీ అధినాయకత్వంపై
ఆయన కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయన టీడీపీలో చేరిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో సి. రామచంద్రయ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. సి.రామచంద్రయ్య తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. రాజ్యసభకు కూడా గతంలో ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీడీపీ గూటికే చేరుకున్నారు.
Next Story

