Sun Feb 01 2026 16:48:48 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఈరోజు సీఎంవో నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలు వీరే
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతో వారు వచ్చి నేతలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.
ఐదో జాబితాలో...
ఐదో విడత జాబితాలో చేర్పులు, మార్పులపై వైసీపీ మళ్లీ కసరత్తులు మొదలు పెట్టింది. అందుకోసమే అనేక మంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. వారంతా వచ్చి నేతలతో సమావేశమవుతున్నారు. సీఎంవోకు వచ్చిన నేతల నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ ఈరోజు ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, భాగ్యలక్ష్మి, బుర్రా మధుసూదన్ యాదవ్ లు వచ్చారు.
Next Story

