Wed Jul 16 2025 23:42:48 GMT+0000 (Coordinated Universal Time)
ఉయ్యూరు శ్రీనివాస్ ను వెనకేసుకొచ్చిన వసంత
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుంటూరు ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ ను సమర్థించారు.

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుంటూరు ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ ను సమర్థించారు. అది దురదృష్టకర ఘటన అని చెబుతూనే చాలా మంది గతంలో దుస్తులు పంపిణీ చేశారని, అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రజలకు నష్టం కలిగించాలన్నది వారి ఉద్దేశ్యం కాదని ఆయన తెలిపారు. ఎన్నారైలను భయపెడితే ఎలా అని ప్రశ్నించడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది.
నాకు మంచి మిత్రుడు...
ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకునేలా చూడాలని కోరారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకోవాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరికాదని వైసీపీ నేతలకే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇది సరికాదని, ఇలా చేస్తే అభివృద్ధిని ఆపడమే అవుతుందని అన్నారు. రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉయ్యూరు శ్రీనివాస్ పై పనికి రాని రాద్ధాంతం చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ మండి పడ్డారు. సేవా కార్యక్రమాలు చేయబోయి ఉయ్యూరు శ్రీనివాస్ కష్టాలు పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
Next Story