Thu Jan 16 2025 03:02:28 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ పై ఊహించని దాడి
వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే
కొత్తపల్లి : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామానికి వచ్చిన వైసీపీ నేత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఆగ్రహంతో ఉన్న ఓ వర్గం నుండి ఎమ్మెల్యేను పక్కకు తప్పించడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. ఎమ్మెల్యేను దాడి నుంచి రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎమ్మెల్యే మీద దాడి చేశారు.
జి.కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే ఆయనను హత్య చేయించిందని ఆ వర్గీయులు అనుమానిస్తున్నారు. ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రోత్సహించారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రసాద్ హత్య గురించిన సమాచారం అందుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గ్రామానికి వెళ్లారు. ప్రసాద్ మృతి నేపథ్యంలో వ్యతిరేక వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మృతుడి వర్గీయులు ఎమ్మెల్యేను చూడగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎమ్మెల్యేపై మూకుమ్మడిగా దాడికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిని తోసేసి మరీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఊహించని దాడికి ఎమ్మెల్యే ఖంగు తిన్నారు.
Next Story