Sat Mar 07 2026 21:02:12 GMT+0530 (India Standard Time)
Pinnelli : ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటీషన్ వేశారు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో పిన్నెల్లి తరుపున న్యాయవాదులు ఈ పిటీషన్ వేయడం గమనార్హం. ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమయింది.
కేసు విచారణలో...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ లో నారా లోకేష్ ఈ వీడియోను తొలుత విడుదల చేశారని పిన్నెల్లి తరుపు న్యాయవాది వాదించారు. ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చిందో తెలియదని ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేయడాన్ని ఆయన ఈసందర్బంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సుప్రీకోర్టులో పలు కేసులను ఉదహరించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది.
Next Story

