Mon Mar 16 2026 13:34:43 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : పీఏసీ ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్ – వైసీపీ వైఖరి స్పష్టత
పీఏసీ ఛైర్మన్ గా పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు. వైసీపీకి ఈ పదవి కేటాయిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

పీఏసీ ఛైర్మన్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరుపున వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. పీఏసీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగాల్సి ఉంది. అయితే పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. అయితే వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి.
ఎవరికస్తారన్నదే...
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్ పదవిని వైసీపీకి ఇస్తుందా? లేదా? అన్నది కొంత సందేహంగానే మారింది. టీడీపీ తర్వాత ఎక్కువ స్థానాలను గెలుచుకున్న జనసేనకు పీఏసీ ఛైర్మన్ ఇస్తారా? లేక సంప్రదాయం ప్రకారం వైసీపీకి ఈ పదవిని కేటాయిస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. వైసీపీ తరుపున అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Next Story

