Sat Mar 07 2026 19:51:49 GMT+0530 (India Standard Time)
నేడు చంద్రబాబుతో పార్ధసారధి భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి నేడు సమావేశం కానున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి నేడు సమావేశం కానున్నారు. పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్థసారధి టీడీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లుగానే ఆయన టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఆయన మరోసారి పెనమలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని పార్థసారధి అనుచరులు చెబుతున్నారు.
ఎక్కడి నుంచి?
అదే సమయంలో పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను నిన్న అధిష్టానం నియమించడంతో పార్థసారధి క్విట్ దాదాపుగా ఖాయమయినట్లే కనిపిస్తుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తారా? లేదా నూజివీడు నుంచి బరిలోకి దిగుతారా? అన్న దానిపై స్పష్టత రానుంది.
Next Story

