Fri Mar 20 2026 03:15:04 GMT+0530 (India Standard Time)
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు

వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ముస్తాఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు సార్లు ముస్తాఫా తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
వారసురాలిగా...
అయితే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తన రాజకీయ వారసురాలిగా కుమార్తెను బరిలోకి దింపుతున్నానని ప్రకటించారు. తన కుమార్తె ఫాతిమా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఫాతిమాకు వైసీపీ హైకమాండ్ మద్దతు ఉందని, జగన్ ఆశీస్సులతోనే ఫాతిమా పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.
Next Story

