Sun Mar 15 2026 08:40:32 GMT+0530 (India Standard Time)
సర్కార్ కు కోటంరెడ్డి అల్టిమేటం
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అవసరమైతే ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తానని ఆయన హెచ్చరించారు.
ఉద్యమం చేస్తా...
మంత్రులు మారినా తమ నియోజకవర్గంలో సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే వారు లేరన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేనప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఎందుకని ఆయన ఆవేదన చెందారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికైనా వెనుకాడనని అధికారులకు ఆయన అల్టిమేటం ఇచ్చారు.
Next Story

