Sat Mar 21 2026 20:39:24 GMT+0530 (India Standard Time)
Mlc Election : వైసీపీని టెన్షన్ పెట్టిన ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు హైకమాండ్ ను టెన్షన్ పెట్టారు. ఈరోజు నెలిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కుమారుడు వివాహం

వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు పార్టీ హైకమాండ్ ను టెన్షన్ పెట్టారు. ఈరోజు నెలిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కుమారుడు వివాహం. అయితే వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అప్పలనాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ హాజరు కాలేదు. 175 మందిలో 174 మంది వరకూ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
వివాహ వేడుకకు...
కానీ నెలిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రం ఇంతవరకూ ఓటింగ్‌కు రాలేదు. అయితే వివాహ వేడుక పూర్తయిన తర్వాత అప్పలనాయుడు ప్రత్యేక చాపర్ లో విజయవాడకు బయలుదేరి నట్లు చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. చివరి నిమిషంలో అప్పలనాయుడు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారా? లేదా? అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొని ఉంది.
Next Story

