Sun Apr 27 2025 02:31:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏడ్చే వారికి అధికారం ఇస్తే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడ్చేవారికి అధికారమిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. చంద్రబాబు అధికారంలో లేకుండా బతకలేరన్నారు. ఆయన అధదికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా ప్రయత్నిస్తారన్నారు. అందుకే అసెంబ్లీలో శపథం చేసి మరీ వెళ్లిపోయారని, సీఎంగా కాదు కదా? ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి చంద్రబాబు రాలేడని అంబటి రాంబాబు అన్నారు.
రాష్ట్రానికి పట్టిన శని....
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శనిలాగా మారారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు గౌరవ సభలు పెడతారంటున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ చంద్రబాబుకు లేదని, ఇక ఆయన అసెంబ్లీకి రానవసరం లేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రజలు జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని, అది చూసి ప్రతిరోజూ చంద్రబాబు ఏడవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
Next Story