Sun Mar 15 2026 08:20:33 GMT+0530 (India Standard Time)
నేడు జనసేనలో చేరనున్న వైసీపీ ఎంపీ
వైసీపీ పార్లమెంటు సభ్యుడు బాలశౌరి నేడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయన వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేశారు

వైసీపీ పార్లమెంటు సభ్యుడు బాలశౌరి నేడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయన వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో తనకు పార్టీ తగిన న్యాయం చేయలేకపోయిందని ఆరోపస్తూ ఆయన పార్టీ నుంచి వైదొలిగారు. ఇటీవల పవన్ కల్యాణ్ ను కూడా కలసి తన చేరికపై చర్చించారు.
ఎక్కడి నుంచి పోటీ...
అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి బాలశౌరి మచిలీపట్నం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. జనసేనలో నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో చేరబోతున్న బాలశౌరి ఉదయం కుటుంబ సభ్యులతో కలసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు. ఆయన అనుచరులతో కలసి జనసేన జెండా కప్పుకోనున్నారు.
Next Story

