Mon Dec 15 2025 00:07:45 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP Manifesto: మ్యానిఫేస్టో 2 "O" విడుదలకు రెడీ
ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు

YSRCP Manifesto:ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎల్లుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ మ్యానిఫేస్టోను విడుదల చేస్తారా? లేదా మరెవరైనా నేతలు ప్రజల ముందు ఉంచుతారా? అన్నది తెలియరాలేదు. అనేక ప్రజాకర్షక పథకాలకు ఈ మ్యానిఫేస్టోలో చోటు కల్పించినట్లు తెలిసింది
ఈ నెల 26న ...
చాలా వరకూ సీఎం జగన్ స్వయంగా ఈసారి మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మ్యానిఫేస్టో రూపకల్పన పూర్తి కావడంతో తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై జగన్ స్వయంగా ప్రజలకు వివరించనున్నారు. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో ఉండేలా రూపొందించినట్లు తెలిసింది. మహిళలు, యువత, రైతులే టార్గెట్ గా ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ప్రస్తుతమున్న పథకాలను కొనసాగిస్తూ దానికి సంబంధించిన నగదును పెంచి జగన్ జనం ముందు ఉంచుతారన్న ప్రచారమయితే జోరుగా నడుస్తుంది.
Next Story

