Sun Mar 08 2026 10:31:58 GMT+0530 (India Standard Time)
YSRCP : 20న వైసీపీ మ్యానిఫేస్టో విడుదల.. వారినే లక్ష్యంగా
వైసీపీ మ్యానిఫేస్టోను ఈ నెల 20వ తేదీన ఆ పార్టీ అధినేత జగన్ విడుదల చేయనున్నారు

వైసీపీ మ్యానిఫేస్టోను ఈ నెల 20వ తేదీన ఆ పార్టీ అధినేత జగన్ విడుదల చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చే దిశగా మ్యానిఫేస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫేస్టోలో 99 శాతం అంశాలను అమలు చేసినట్లు చెప్పుకునే వైసీపీ ఈసారి కూడా పేదలు, మహిళలు లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందించినట్లు తెలిసింది. మహిళలను ఆకట్టుకునేలా కొత్త పథకాలకు ఈ మ్యానిఫేస్టోలో చోటు కల్పించారని సమాచారం.
మహిళలను లక్ష్యంగా...
ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇక మ్యానిఫేస్టోను కూడా ప్రకటించి జనంలోకి వెళ్లాలని భావిస్తుంది. అందుకోసమే ఈ నెల 20వ తేదీన విడుదల చేయాలని అనుకుంటోంది. మ్యానిఫేస్టో క్లుప్తంగానే అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారని, చిన్న చిన్న మార్పులకు జగన్ ఆదేశించడంతో వాటిని సవరించి ఆయన ఈ నెల 20వ తేదీన విడుదల చేయడానికి పార్టీ అధినేత సిద్ధమవుతున్నారు. అయితే ఎక్కడ దీనిని ప్రకటిస్తారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

