Sun Mar 15 2026 13:25:19 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు గవర్నర్ వద్దకు వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు వైసీపీ నేతలు కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు వైసీపీ నేతలు కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరగనున్న హింసపై ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వైసీపీ నేతలు వివరించనున్నారు. ఇందుకు బాధ్యులయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.
ఎన్నికల అనంతర హింసపై...
మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు కలవనుంది. ప్రధానంగా టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లోనే ఈ గొడవలు జరగుతున్నాయని, కావాలని రెచ్చగొట్టేలా ఘర్షణలకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఘర్షణలకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించనున్నారు.
Next Story

