Fri Dec 05 2025 20:23:38 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Liqur Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో ట్విస్ట్.. విజయసాయిరెడ్డికి టీడీపీతో లింకులు?
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి టీడీపీనేతలతో సంబంధం ఉన్న వీడియోను వైసీపీ నేతలు బయటపెట్టారు

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి టీడీపీనేతలతో సంబంధం ఉన్న వీడియోను వైసీపీ నేతలు బయటపెట్టారు. ఇటీవల వైఎస్ జగన్ కూడా విజయసాయిరెడ్డి చంద్రబాబుతో విజయసాయిరెడ్డి లాలూచీ పడ్డారని ఆరోపించిన నేపథ్యలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించకుంది. విజయసాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలియజేసేందుకు ఈ వీడియోను వైసీపీ నేతలు విడుదల చేసినట్లు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై విజయసాయిరెడ్డి తన పదవులకు రాజీనామా చేశారన్న దానికి కూడా ఈ వీడియో ఒక ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని లోబర్చుకున్న టీడీపీ నేతలు ఆయనను కలసి జగన్ పై కావాలని మద్యం స్కాం కు సంబధించి ఆరోపణలు చేశారని అంటున్నారు.
మద్యంస్కామ్ లో...
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే ఏడుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ చేసిన పోలీసులు ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి తో పాటు జగన్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మిధున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అసలు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి పేరును బయటపెట్టింది విజయసాయిరెడ్డి. ఆయన ఆ పేరు బయటపెట్టిన తర్వాత మాత్రమే కేసులో మరింత వేగం పెరిగింది. రాజ్ కేసిరెడ్డితో పాటుగా తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తొండెపు దశరథ్ జనార్థన్ తో...
అయితే విజయసాయిరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచిన సమయంలో తెలుగుదేశం పార్టీ కి చెందిన కీలక నేత, చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు అయిన తొండెపు దశరధ జనార్థన్ విజయసాయిరెడ్డితో సమావేశమవ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వైర్ పత్రిక కథనం కూడా ఈ విషయాన్ని ప్రచురించింది. దీంతో మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి టీడీపీ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్ లు పెడుతున్నారు. కావాలని జగన్ తో పాటు ఆయన కోటరీగా చెప్పుకునే వారిని ఇబ్బంది పెట్టేందుకు విజయసాయిరెడ్డి టీడీపీ చేతిలో పావుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఒకరోజు ముందు...
సిట్ విచారణకు హాజరయ్యే ఒకరోజు ముందు టీడీపీ నేత తొండెపు దశరథ జనార్థన్ తో విజయసాయిరెడ్డి మాట్లాడటం, తర్వాత ఆయన బయటకు వచ్చి రాజ్ కేసిరెడ్డి పేరు బయటకు చెప్పడంతో పాటు కోటరీ గురించి కూడా ప్రస్తావించడం వంటి అంశాలను కలగలిపి ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి నుంచి జగన్ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో పాటు త్వరలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి పదవులు పొందుతారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తం మీద జగన్ చేసిన ఆరోపణలకు అద్దం పడుతూ సాయిరెడ్డితో తొండెపు దశార్ధన్ కలిసిన వీడియో బయటకు రావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.
Next Story

