Sun Mar 15 2026 12:34:08 GMT+0530 (India Standard Time)
YSRCP : ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైసీపీ నేతలు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాను వైసీపీ నేతలు కలిశారు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాను వైసీపీ నేతలు కలిశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం కలిసింది. నిన్న వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వారు కోరారు.
నిష్పక్షపాతంగా...
జగన్ పై దాడి ఘటనను కొందరు రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల క్లిప్పింగ్ లను కూడా ఆయనకు ఇచ్చినట్లు తెలిసింది. విచారణ వేగవంతంగా చేసి నిందితులను పట్టుకోవాలని వైసీపీ నేతల బృందం ఎన్నికల కమిషనర్ ను కోరినట్లు తెలిసింది.
Next Story

