Thu Jan 29 2026 02:34:37 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి మామూళ్ల కోసమే భేటీ
చంద్రబాబు, పవన్ కల్యాణ భేటీపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ భేటీపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జీవో నెంబరు ఒకటిపైన పవన్, చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చుని చర్చించడమేంటని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయన్నారు. వారిద్దరి భేటీతో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీ లేదని మల్లాది విష్ణు అన్నారు. పవన్ కు ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదని, ప్యాకేజీ కోసమే వెళ్లాడని ఆయన మండిపడ్డారు.
డూడూ బసవన్నలా...
వారిద్దరి ముసుగు తొలగిపోయిందన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పవన్ రాష్ట్రంలో పనిచేస్తున్నాడని అన్నారు. సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి దగ్గరకు దత్తపుత్రుడు వెళ్లాడంటూ మంత్రి గుడివాడ అమరనాథ్ ట్వీట్ చేశారు. సంక్రాంతికి అందరి ఇళ్లకు గంగిరెద్దులు వెళతాయన్నారు. డూడూ బసవన్నలా తలఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడని అంబటి రాంబాబు అన్నారు.
Next Story

