Mon Mar 16 2026 03:11:42 GMT+0530 (India Standard Time)
ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్‌ను కొనసాగించాలి
ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ మరికొంత కాలం కొనసాగించాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు

ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ మరికొంత కాలం కొనసాగించాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే జూన్ తో ఉమ్మడి రాజధాని గడువు పూర్తికానుంది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే జూన్ నెలతో పదేళ్ల కాలం పూర్తి కావస్తుండటంతో మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరి కొంత కాలం...
ఏపీకి కొత్త రాజధానిగా విశాఖపట్నం ప్రకటించేంత వరకూ హైదరాబాద్ ను రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. న్యాయపరమైన వివాదాలతో మూడు రాజధానుల అంశం పెండింగ్‌లో ఉందని, ఆ వివాదం పూర్తయ్యే వరకూ హైదరాబాద్ నే కొనసాగించాలని ఆయన కోరారు.
Next Story

