Sun Mar 15 2026 14:04:49 GMT+0530 (India Standard Time)
బాబును అర్జంటుగా సీఎంను చేయడానికే
చంద్రబాబును అత్యవసరంగా ముఖ్యమంత్రిని చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

తెలుగుదేశం పార్టీ చంద్రబాబును అత్యవసరంగా ముఖ్యమంత్రిని చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అందరికంటే ముందు స్పందించింది జగన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
స్టీల్ ప్లాంట్ ను...
స్టీల్ ప్లాంట్ ను సంరక్షించుకోవాలనే దానిపై జగన్ సూచనలు చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా? అంటూ సజ్జల ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించ కూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని, అదే తమ డిమాండ్ అని, దానిపై చివరి వరకూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు.
Next Story

