Fri Dec 05 2025 17:50:08 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : మంగళగిరి పోలీస్ స్టేషన్ కు సజ్జల
మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిన్న సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. . సజ్జలతోపాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
న్యాయవాదులను మాత్రం...
విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. అయితే విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్ లోకి వెళ్లారు.
Next Story

