Fri Dec 05 2025 12:40:51 GMT+0000 (Coordinated Universal Time)
12న 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కూటమి సర్కార్ ను నిలదీసేందుకు యువత సిద్ధమవ్వాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు

విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి సర్కార్ ను నిలదీసేందుకు యువత సిద్ధమవ్వాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. ఈ నెల 12న యువత పోరుతో ప్రభుత్వాన్ని నిలదీద్దామని కోరారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. నిరుద్యోగభృతి పేరుతో మరో వంచన చేస్తుందన్న సజ్జల కూటమి సర్కర్ వైఫల్యాలను ఎత్తిచేపేలా వైయస్ఆర్సీపీ నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.
ఆవిర్భావ వేడుకలుకూడా..
పల్లెపల్లెలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని కోరారు. ప్రజల్లో పార్టీకి ఉన్న పట్టును చాటుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఉత్సాహంగా వైసీపీ కార్యకర్తులు, నాయకులు పాల్గొనాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Next Story

