Wed Jan 21 2026 03:31:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రహ్మారెడ్డి డొనేషన్ల కోసమే పోటీ చేశాడు : పిన్నెల్లి
జూలకంటి బ్రహ్మారెడ్డి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు

జూలకంటి బ్రహ్మారెడ్డి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమి భయంతో బ్రహ్మారెడ్డి తన క్యాడర్ ను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే తాము గెలుస్తామని భావించి, జూలకంటి ఇలాంటి అలజడి సృష్టించడం ఎప్పుడూ ఆయనకు అలవాటేనని అన్నారు.
వచ్చిన నాటి నుంచే...
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనలు చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుందన్నారు. బ్రహ్మారెడ్డి వచ్చిన నాటి నుంచే ఘర్షణలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ ఘర్షణల వెనక ఎవరు ఉన్నారన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. బ్రహ్మారెడ్డివిచెప్పేవన్ని అబద్ధాలేనన్న ఆయన, కేవలం విరాళాల కోసమే పోటీలో నిలబడ్డారన్నారు పిన్నెల్లి. లావు కృష్ణ దేవరాయలు తమ పార్టీ నుంచి నెలరోజులు ముందు మారి ఆయన పోలీసు అధికారులను మార్చారన్నారు.
Next Story

