Fri Dec 05 2025 15:03:43 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : నా ప్రయాణం జగన్ తోనే... పేరు మార్చుకుంటున్నా : ముద్రగడ
తాను జగన్ వెంటే నడుస్తానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. మరొక పార్టీ వైపు చూడనని ఆయన అన్నారు

తాను జగన్ వెంటే నడుస్తానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. మరొక పార్టీ వైపు చూడనని ఆయన అన్నారు. ఈరోజు కిర్లంపూడిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. సంక్షేమ పథకాలను అన్ని అమలు చేసినా జగన్ ను ప్రజలు ఎందుకు ఆదరించలేదో అర్థం కావడం లేదన్నారు. కానీ ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలకు తన శుభాకాంక్షలు ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.
చెప్పినట్లుగానే...
మరోవైపు తాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటున్నానని తెలిపారు. పిఠాపురంలో జనసేన నేత పవన్ కల్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని చెప్పానని, చెప్పిన మాట ప్రకారమే తన పేరు మార్చుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో పెద్దగా అవమాన పడేది ఏదీ ఉండదన్నారు. తాను చెప్పిన మాట ప్రకారమే, అన్న ప్రకారమే తన పేరు మార్చుకోవడానికి రెడీ అయినట్లు తెలిపారు.
Next Story

