Mon Mar 16 2026 04:26:51 GMT+0530 (India Standard Time)
కొత్త జిల్లా కేంద్రానికి పదిహేను కోట్ల స్థలం విరాళం
భీమవరంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల స్థలాన్ని ఇస్తానని వైసీపీ నేత గాదిరాజు సుబ్బరాజు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనిపై కొన్ని అభ్యంతరాలున్నా ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. ఇందులో భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కానుంది. భీమవరంలో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తానని వైసీపీ నేత గాదిరాజు సుబ్బరాజు తెలిపారు.
పది ఎకరాలు...
భీమవరం పట్టణం సమీపంలోని కాళ్ల వద్ద తనకు పది ఎకరాల భూమి ఉందని, దాని విలువ ప్రస్తుతం పదిహేను కోట్లు ఉంటుందని సుబ్బరాజు తెలిపారు. భీమవరం జల్లా కేంద్రంగా ఏర్పడుతున్నందున తన స్థలాన్ని ఉచితంగా ప్రభుత్వానికి ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ఎప్పుడు ప్రభుత్వం కావాలంటే అప్పుడే తన స్థలాన్ని ఇస్తానని ఆయన చెప్పారు. స్థలాన్ని మెరక చేసి మరీ ఇస్తానని ఆయన చెప్పారు.
Next Story

