Thu Jul 17 2025 00:26:26 GMT+0000 (Coordinated Universal Time)
కూటమి సర్కార్ పై భూమన హాట్ కామెంట్స్
కూటమి సర్కార్ పై వైసీపీ నేత భూమన హాట్ కామెంట్స్ చేశారు

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన చేస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ను సమూలంగా నాశనం చేయాలనే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ని, నాయకులను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారని తెలిపారు. కక్ష పూరితంగా నిరంతరం మారణ హోమం సృష్టిస్తున్నారని, ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు ను వేధించడమే పనిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తోందని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.
రాక్షసపాలన అంటూ...
ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం సీనియర్ ఐ. ఏ.ఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను మద్యం కుంభకోణం పేరుతో అరెస్టు చేశారన్నారు. నిజాయితీగల అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారన్న భూమన జగన్ మోహన్ రెడ్డి ను అరెస్ట్ చేయాలనే కుట్ర దాగుందని తెలిపారు. శిశుపాలుడు తప్పుల్ని శ్రీకృష్ణుడు ఎంచిన విధంగా, మీ తప్పులు ప్రజలు లెక్కిస్తున్నారని, ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.
Next Story