Sun Dec 14 2025 19:33:43 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన ఫ్లెక్సీలో ఆమంచి.. ఇది నిజమేనా?
జనసేనలోకి వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు వెళుతున్నట్లే కనిపిస్తుంది. చీరాలలో ఫ్లెక్సీని బట్టి అదే అర్థమవుతుంది

జనసేన పార్టీలోకి వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు వెళుతున్నట్లే కనిపిస్తుంది. చీరాలలో కనిపిస్తున్న ఫ్లెక్సీని బట్టి అదే అర్థమవుతుంది. ఆమంచి కృష్ణమోహన్ ను ఇటీవల వైసీపీ హైకమాండ్ పర్చూరు నియోజకరవర్గం పార్టీ ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. చీరాలలో పట్టున్న కుటుంబం పర్చూరుకు వెళ్లేందుకు కొంత తొలుత అయిష్టత వ్యక్తం చేసినా హైకమాండ్ సూచనలతో వెళ్లక తప్పలేదు.
పర్చూరు ఇన్ఛార్జిగా...
అయితే తాజాగా ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు పేరుతో జనసేన ఫ్లెక్సీలు చీరాల ప్రాంతంలో వెలిశాయి. జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ ఆమంచి స్వాములు పేరిట ఫ్లెక్సీలు వెలువడటంతో ఆయన అభిమానులు డైలమాలో పడినట్లయింది. ఆమంచి స్వాములు జనసేనలో చేరే అవకాశముందని కొందరు చెబుతుండగా, అదేమీ లేదని పవన్, ఆమంచి అభిమానులు ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఉండవచ్చని చెబుతున్నారు. మొత్తం మీద చీరాలలో ఆమంచి రాజకీయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
Next Story

