Thu Mar 19 2026 05:50:32 GMT+0530 (India Standard Time)
పర్చూరులో ఎంట్రీ ఇచ్చిన ఆమంచి
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను ఆయన స్వీకరించారు

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను ఆయన స్వీకరించారు. వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆయన స్వాగతం పలికారు. బైకులు, కార్లతో ఆమంచిని పర్చూరుకు ఆహ్వానించారు. ఇటీవల పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణ మోహన్ ను వైసీపీ అధినేత జగన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇన్ఛార్జి బాధ్యతలను స్వీకరిస్తారా? లేదా? అన్న మీమాంస తొలగిపోయింది.
పర్చూరులో ఘన స్వాగతం...
ఆమంచి కృష్ణ మోహన్ తాను ఇన్ఛార్జి పదవిని స్పీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పర్చూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పర్చూరుకు వచ్చిన ఆమంచి తొలుత వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Next Story

