Thu Jul 17 2025 00:42:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతిపక్ష హోదా కూడా దక్కేట్లు లేదుగా?
వైసీపీకి ఈఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురుకాబోతుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు

వైసీపీకి ఈఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురుకాబోతుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలు కూడా లేకపోలేదు. తూర్పు గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, రెండు స్థానాలు మినహాయిస్తే అన్ని స్థానాలను టీడీపీ దక్కించుకునే అవకాశముంది.
రాయలసీమలోనూ...
చివరకు రాయలసీమలోనూ జగన్ పార్టీని ఆదరించలేదు. పెత్తందార్లు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అని జగన్ చేసిన నినాదం ఆయన కొంపముంచేలా చేసిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అగ్రవర్ణాలు ఎవరూ ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదు. సీమలో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు సీన్ రివర్స్ గా మారడంతోనే జగన్ పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది.
Next Story