Mon Jan 20 2025 15:59:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : టార్గెట్ పిఠాపురం.. నేడు పార్టీ నేతలతో జగన్ సమావేశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది
YSRCP :జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం పిఠాపురం జనసేన నేతలు కొందరు వైసీపీలో చేర్చనున్నారు. పిఠాపురం బాధ్యతలను ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభం, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత చేరుకోనున్నారు.
గెలుపు కోసం...
పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రత్యేకంగా వైసీపీ కసరత్తు చేసింది. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్ఛార్జులను నియమించనుంది. దీంతో పాటు ఈ నియోజకవర్గంలో గెలుపు ఎలా సాధించాలన్న దానిపై వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే లక్ష్యంగా ఎవరు ఏం పని చేయాలో జగన్ నేతలకు బాధ్యతలను అప్పగించనున్నారు. అందుకోసమే పిఠాపురం నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
Next Story