Fri Mar 20 2026 07:47:55 GMT+0530 (India Standard Time)
Breaking : వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీళ్లే.. ఖరారు చేసిన జగన్
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను వైసీీపీ ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థుల పేర్లను జగన్ ఓకే చెప్పారు

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను వైసీీపీ ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థుల పేర్లను జగన్ ఓకే చెప్పారు. వీరు ముగ్గురు కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ను కలిశారు. మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు రఘునాధరెడ్డి పేర్లను ఖరారు చేసింది.
మూడు స్థానాలను...
ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలను తామే దక్కించుకునేలా చర్యలు తీసుకుంటుంది. త్వరలో మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ నెల27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది.
Next Story

