Wed Mar 18 2026 23:53:54 GMT+0530 (India Standard Time)
జగన్ ఐదేళ్లు మాత్రమే అధ్యక్షుడు
వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఐదేళ్లు మాత్రమే కొనసాగుతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఐదేళ్లు మాత్రమే కొనసాగుతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవితకాలం అధ్యక్ష పదవిని జగన్ ను తిరస్కరించారని ఆయన చెప్పారు. అందుకే శాశ్వత అధ్యక్షుడి అంశం ప్లీనరీలో జరిగిన మినిట్స్ లోకి కూడా ఎక్కలేదని ఆయన తెలిపారు. అందువల్ల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనేవారు లేరని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఎన్నికల కమిషన్ కు...
జగన్ శాశ్వత అధ్యక్షుడిగా అంగీకరించకపోవడంతో ఆయన ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారన్నారు. ఆ తర్వాత తిరిగి ఎన్నిక జరగనుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన మాట వాస్తవమేనని, అందుకు సంబంధించి వివరణను కమిషన్ కు పంపామని సజ్జల తెలిపారు.
Next Story

