Sun Mar 15 2026 09:39:42 GMT+0530 (India Standard Time)
నేడు హైకోర్టులో సజ్జల ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై తన ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఈకేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు 120వ నిందితుడిగా చేర్చడంతో ఆయన తన ముందస్తు బెయిల్ పిటీషన్ ను వేశారు.
కక్ష సాధింపుచర్యతోనే....
తనపై కక్ష సాధింపుచర్యతోనే ఈకేసు నమోదు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం సెక్షన్ చేర్చడంపై కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. అయితే తాను న్యాయస్థానం విధించే షరతులకు లోబడి ఉంటానని కూడా సజ్జల తన పిటీషన్ లో పేర్కొన్నారు. నేడు ఈపిటీషన్ పై విచారణ జరగనుంది.
Next Story

