Fri Dec 05 2025 17:49:41 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఎందుకు గెలుస్తుందో చెప్పిన సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయనపై ఆయనకే నమ్మకం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయనపై ఆయనకే నమ్మకం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏం చేస్తానో చెప్పకుండా ముఖ్యమంత్రి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు దానిని గమనించారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను విడుదల చేసిన సూపర్ సిక్స్, మ్యానిఫేస్టోలను కూడా చంద్రబాబు ప్రచారం చేసుకోలేదని, జగన్ పై వ్యక్తిగత దూషణలకే ఎక్కువ సమయం కేటాయించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తిరిగి అధికారంలోకి...
జగన్ మాత్రం తాను గతంలో చేసిన పనులు మాత్రమే చెప్పారన్నారు. తన ప్రచారంలో తాను మళ్లీ అధికారంలోకి వస్తేవ తాము ఏం చేస్తామో జగన్ చెప్పగలిగామని చెప్పారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామని తెలిపారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని అనుకోలేమని అన్నారు. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారులతో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలవాలని భావించారని, అయితే అది సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story

