Mon Jan 20 2025 08:11:19 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : చంద్రబాబును నమ్మేదెవరు? ఆయన ప్రజలకు ఏం చెప్పాలో తెలియడం లేదంటూ?
టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనం రావడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనం రావడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లకు టిక్కెట్లను ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని అనుమతులు తీసుకున్న ప్యాంట్రీకారుపై తప్పుడు ప్రచారానికి దిగుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ అసత్య ప్రచారాన్ని ఒకవర్గం మీడియా తప్పుదోవపట్టించే విధంగా కథనాలను ప్రచురిస్తుందన్నారు. ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబుకు ఏం చెప్పాలో తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఒక్క పథకం గురించి...
చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి గురించి కానీ, ఒక్క పథకాన్ని గురించి కానీ చెప్పే ధైర్మముందా? అని ప్రశ్నించారు. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో వేశారన్నారు. అధికారంలోకి వచ్చేంత వరకూ చెప్పిన మాటలు వచ్చిన తర్వాత అమలు చేయరని ప్రజలకు కూడా తెలిసిందన్నారు. చంద్రబాబు అంటేనే మోసం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశ్వసనీయత లేని నేత ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు మాత్రమేనని అన్నారు.
Next Story