Wed Jan 28 2026 23:46:51 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ వస్తే మంచిదేగా?
కొత్త పార్టీలు రావడం సహజమేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయన స్పందించారు

కొత్త పార్టీలు రావడం సహజమేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయన స్పందించారు. కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అది వీలవుతుందని ఆయన అన్నారు. తాము కొత్త పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సజ్జల అభిప్రాయపడ్డారు. తాము ఆటగాళ్లమని, తమ రూల్స్, తమ అజెండా తమకు ఉన్నాయని ఆయన మీడియాతో తెలిపారు.
తాము రాష్ట్రానికే...
ప్రజల్లో తమ పార్టీకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలోకి ఏ పార్టీ అయినా రావచ్చని ఆయన అన్నారు. ప్రజల అజెండాతో ఏ పార్టీ అయినా రావచ్చని, అయితే చివరకు ప్రజలు ఆశీర్వదించాలని ఆయన అన్నారు. ప్రజల అజెండాతో పార్టీలు వస్తే మంచిదేనని ఆయన అన్నారు. తమ పార్టీ మాత్రం రాష్ట్రానికే పరమితమయి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఎవరు విజేత అన్నది చివరకు తేల్చాల్సింది ప్రజలేనని అన్నారు. ఒక అన్నగా తమ్ముడి గురించి మాట్లాడి ఉండవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.
Next Story

