Sun Mar 15 2026 16:04:50 GMT+0530 (India Standard Time)
నటుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?
నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఒక నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు వద్ద పవన్ రాజకీయాలను తాకట్టు పెట్టాడని ఆయన అన్నారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారని, తాము ఎదురు తిట్టుకోగలిగితే తట్టుకోగలరా? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
మూడు రాజధానులు...
వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అర్థం లేనిదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎవరు కలిసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. బూతులు తిడుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి గడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించాలని ఆయన కోరారు. జగన్ పడుతున్న కష్టానికి ప్రతిఫలాన్ని అందించాలన్నారు.
Next Story

