Wed Jan 28 2026 22:08:18 GMT+0000 (Coordinated Universal Time)
7 నుంచి జగనన్నే మా భవిష్యత్
ఈ నెల 7వ తేదీ నుంచి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

సచివాలయ కన్వీనర్లు గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు .గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
శాసనసభ్యుల నేతృత్వంలో...
మొత్తం యంత్రాగం అంతా శాసన సభ్యులు. రీజినల్ కో ఆర్డినెటర్ల నేతృత్వంలో జరుగుతుందని ఆయన చెప్పారు. జగనన్నే మా భవిష్యత్... మా నమ్మకం నువ్వే జగన్ అన్న నినాదం జనంలోంచి వచ్చిన నినాదమని చెప్పిన సజ్జల, ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం తో మార్పు కనిపిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story

