Sat Dec 06 2025 00:45:26 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సంబరాలకు సిద్ధం కండి : పార్టీ క్యాడర్ కు సజ్జల పిలుపు
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు పిలుపు నిచ్చారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు పిలుపు నిచ్చారు. రేపు ఉదయం పది గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని సజ్జల అభిప్రాయపడ్డారు. ఎవరు ఏమి అనుకున్నా... ఎన్ని కుట్రలు చేసేినా తిరిగి జగన్ సీఎం కావడం ఖాయమన ిఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు అందరిని భయపెడుతున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు. అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని, కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
డిక్లరేషన్ తీసుకునేంత వరకూ...
కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేవరకు ఎవరూ బయటకు రావోద్దని చెప్పారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్పై కొత్త నిబంధన పెట్టారన్న సజ్జల దేశంలో లేని నిబంధనలు కేవలం ఏపీలోనే పెట్టారన్నారు. అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేశారన్నారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు లేకుంటే ఎగ్జిట్ పోల్స్లో ఈ ఫిగర్ వచ్చేవి కాదని, మెజార్టీ సర్వేలన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story

