Fri Mar 27 2026 17:10:53 GMT+0530 (India Standard Time)
జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ
మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది

మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే మార్గాన్ని మార్చి జగన్ భద్రత పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్కువ దూరంలో చేరుకోవాల్సిన మార్గాన్ని కాదని, ఎక్కువ సమయంలో ఆయనను పర్యటనకు వెళ్లాలని నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు.
ఇటీవల పర్యటనలో...
ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం లేఖ రాశారు. ఇటీవల కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను కోరారు. జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖను కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
Next Story

