Fri Dec 05 2025 16:50:59 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు పులివెందులలో మూడో రోజు జగన్
వైసీపీ అధినేత జగన్ మూడో రోజు పులివెందులలో పర్యటన కొనసాగుతుంది

వైసీపీ అధినేత జగన్ మూడో రోజు పులివెందులలో పర్యటన కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి ప్రజలను కార్యకర్తలను కలుసుకుని వినతిపత్రాలను స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. రెండు రోజుల పాటు ప్రజాదర్బార్ ను జగన్ నిర్వహించారు. అయితే తొలుత ఐదురోజులు పులివెందులలో ఉండాలని జగన్ భావించినప్పటికీ నేటితో పర్యటన ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
నేటితో ముగింపు...
ఈరోజు మధ్యాహ్నం వరకూ పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈరోజు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు వచ్చి జగన్ ను కలవనున్నారు. ఓటమికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం నుంచి ఆయన పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

