Fri Jan 30 2026 14:20:44 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు ఏడో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర
వైసీపీ అధినేత జగన్ ఏడో రోజు బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది

వైసీపీ అధినేత జగన్ ఏడో రోజు బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. నిన్న రాత్రి అమ్మగారి పల్లెలో జగన్ బస చేశారు. ఇక్కడి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి . సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని భోజన విరామానికి ఆగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పూతలపపట్టులో బహిరంగ సభ...
అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం మూడు గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.సభ అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు.
Next Story

