Sun Mar 08 2026 00:33:54 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు మళ్లీ జగన్ బస్సు యాత్ర.. గుడివాడలో బహిరంగ సభ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు తిరిగి ప్రారంభం కానుంది. పదిహేను రోజు బస్సు యాత్రను నేడు ప్రారంభించనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేడు తిరిగి ప్రారంభం కానుంది. పదిహేను రోజు బస్సు యాత్రను నేడు ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కేసరిపల్లి నైట్ క్యాంప్ నుంచి జగన్ యాత్ర బయలుదేరుతుంది. గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి క్రాస్, హునుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడుకు చేరుకుని భోజన విరామానికి ఆగుతారు.
పదిహేనో రోజు...
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జొన్నపాడు, జనార్ధనపురం మీదుగా సాయంత్రం గుడివాడకు చేరుకుంటారు. గుడివాడలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద రాత్రి బసకు జగన్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలో రాయిని గుర్తు తెలియని వ్యక్తులు విసరడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి నేటి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు.
Next Story

